అభినవ్ బింద్రా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి unnecessary ref
పంక్తి 11: పంక్తి 11:
}}
}}


[[1982]], [[సెప్టెంబర్ 28]]న [[పంజాబ్]] లోని [[మొహాలీ]] జిల్లా జీరక్‌పూర్‌లో([[ఛండీగఢ్]] పక్కన) జన్మించిన [[అభినవ్ బింద్రా]] (Abhinav Bindra) (పంజాబీ: ਅਿਭਨਵ ਿਬੰਦਰਾ; హిందీ: अभिनव बिंद्रा) [[భారతదేశం|భారతదేశపు]] ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు. ప్రస్తుత ప్రపంచ షూటింగ్ చాంపియన్ అయిన బింద్రా తాజాగా [[బీజింగ్]] లో జరుగుతున్న [[2008 ఒలింపిక్ క్రీడలు|ఒలింపిక్ క్రీడలలో]] స్వర్ణం సాధించి భారతదేశానికి ఒలింపిక్ క్రీడల చరిత్రలోనే తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. గత 28 సంవత్సరాలుగా ఒలింపిక్ స్వర్ణాలు దక్కని భారత క్రీడారంగానికి బింద్రా సాధించిన మహోన్నత ఘనకార్యం ఇది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో<ref>www.rediff.com/sports/2008/aug/11bindra.htm Abhinav Bindra wins 10m air rifle gold]</ref><ref>[http://results.beijing2008.cn/WRM/ENG/INF/GL/92A/IND_T.shtml Medalists - India], బీజింగ్ 2008 ఒలింపిక్ క్రీడల అధికారక వెబ్‌సైట్</ref> మొత్తం 700.5 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని సాధించిన అభినవ్ బింద్రాకు ఇది అంతర్జాతీయ పోటీలలో ఆరవ స్వర్ణం.
[[1982]], [[సెప్టెంబర్ 28]]న [[పంజాబ్]] లోని [[మొహాలీ]] జిల్లా జీరక్‌పూర్‌లో([[ఛండీగఢ్]] పక్కన) జన్మించిన [[అభినవ్ బింద్రా]] (Abhinav Bindra) (పంజాబీ: ਅਿਭਨਵ ਿਬੰਦਰਾ; హిందీ: अभिनव बिंद्रा) [[భారతదేశం|భారతదేశపు]] ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు. ప్రస్తుత ప్రపంచ షూటింగ్ చాంపియన్ అయిన బింద్రా [[బీజింగ్]] లో జరుగుతున్న [[2008 ఒలింపిక్ క్రీడలు|2008 ఒలింపిక్ క్రీడలలో]] స్వర్ణం సాధించి భారతదేశానికి ఒలింపిక్ క్రీడల చరిత్రలోనే తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. గత 28 సంవత్సరాలుగా ఒలింపిక్ స్వర్ణాలు దక్కని భారత క్రీడారంగానికి బింద్రా సాధించిన మహోన్నత ఘనకార్యం ఇది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో<ref>[http://results.beijing2008.cn/WRM/ENG/INF/GL/92A/IND_T.shtml Medalists - India], బీజింగ్ 2008 ఒలింపిక్ క్రీడల అధికారక వెబ్‌సైట్</ref> మొత్తం 700.5 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని సాధించిన అభినవ్ బింద్రాకు ఇది అంతర్జాతీయ పోటీలలో ఆరవ స్వర్ణం.
==బాల్యం==
==బాల్యం==
1982లో మొహాలీ జిల్లా జీరక్‌‌పూర్‌లో సంపన్నమైన సిక్కు కుటుంబంలో<ref>[http://worldsikhnews.com/6%20August%202008/Sikh%20shooter%20wins%20first%20ever%20individual%20gold%20for%20India%20at%20Olympics.htm] </ref> డాక్టర్ ఏ.ఎస్.బింద్రా, బాబ్లీ బింద్రా దంపతులకు<ref>[http://www.hindustantimes.com/storypage/storypage.aspx?sectionName=&id=7676cbeb-1b06-4430-9352-3552023cb148&MatchID1=4737&TeamID1=8&TeamID2=6&MatchType1=1&SeriesID1=1194&MatchID2=4728&TeamID3=2&TeamID4=3&MatchType2=1&SeriesID2=1191&PrimaryID=4737&Headline=Abhinav%27s+parents+feeling+on+top+of+the+world&strParent=strParentID Abhinav Bindra's parents feeling on top of the world]</ref> జన్మించాడు. డెహ్రాడూన్ లోని ప్రముఖమైన డూన్ స్కూల్‌లో పదవ తరగతి వరకు విద్యనభ్యసించి చండీగర్‌లోనే స్టీఫెన్ స్కూల్‌లో చేరి షూటింగ్ అభ్యాసం ప్రారంభించాడు.
1982లో మొహాలీ జిల్లా జీరక్‌‌పూర్‌లో సంపన్నమైన సిక్కు కుటుంబంలో<ref>[http://worldsikhnews.com/6%20August%202008/Sikh%20shooter%20wins%20first%20ever%20individual%20gold%20for%20India%20at%20Olympics.htm] </ref> డాక్టర్ ఏ.ఎస్.బింద్రా, బాబ్లీ బింద్రా దంపతులకు<ref>[http://www.hindustantimes.com/storypage/storypage.aspx?sectionName=&id=7676cbeb-1b06-4430-9352-3552023cb148&MatchID1=4737&TeamID1=8&TeamID2=6&MatchType1=1&SeriesID1=1194&MatchID2=4728&TeamID3=2&TeamID4=3&MatchType2=1&SeriesID2=1191&PrimaryID=4737&Headline=Abhinav%27s+parents+feeling+on+top+of+the+world&strParent=strParentID Abhinav Bindra's parents feeling on top of the world]</ref> జన్మించాడు. డెహ్రాడూన్ లోని ప్రముఖమైన డూన్ స్కూల్‌లో పదవ తరగతి వరకు విద్యనభ్యసించి చండీగర్‌లోనే స్టీఫెన్ స్కూల్‌లో చేరి షూటింగ్ అభ్యాసం ప్రారంభించాడు.

03:00, 12 ఆగస్టు 2008 నాటి కూర్పు

అభినవ్ బింద్రా
దస్త్రం:Abhinav Bindra.jpg
జననం (1982-09-28) 1982 సెప్టెంబరు 28 (వయసు 41)[1]
వృత్తిక్రీడాకారుడు (షూటర్
ఎత్తు173 cమీ. (5 అ. 8 అం.)

1982, సెప్టెంబర్ 28న పంజాబ్ లోని మొహాలీ జిల్లా జీరక్‌పూర్‌లో(ఛండీగఢ్ పక్కన) జన్మించిన అభినవ్ బింద్రా (Abhinav Bindra) (పంజాబీ: ਅਿਭਨਵ ਿਬੰਦਰਾ; హిందీ: अभिनव बिंद्रा) భారతదేశపు ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు. ప్రస్తుత ప్రపంచ షూటింగ్ చాంపియన్ అయిన బింద్రా బీజింగ్ లో జరుగుతున్న 2008 ఒలింపిక్ క్రీడలలో స్వర్ణం సాధించి భారతదేశానికి ఒలింపిక్ క్రీడల చరిత్రలోనే తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. గత 28 సంవత్సరాలుగా ఒలింపిక్ స్వర్ణాలు దక్కని భారత క్రీడారంగానికి బింద్రా సాధించిన మహోన్నత ఘనకార్యం ఇది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో[2] మొత్తం 700.5 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని సాధించిన అభినవ్ బింద్రాకు ఇది అంతర్జాతీయ పోటీలలో ఆరవ స్వర్ణం.

బాల్యం

1982లో మొహాలీ జిల్లా జీరక్‌‌పూర్‌లో సంపన్నమైన సిక్కు కుటుంబంలో[3] డాక్టర్ ఏ.ఎస్.బింద్రా, బాబ్లీ బింద్రా దంపతులకు[4] జన్మించాడు. డెహ్రాడూన్ లోని ప్రముఖమైన డూన్ స్కూల్‌లో పదవ తరగతి వరకు విద్యనభ్యసించి చండీగర్‌లోనే స్టీఫెన్ స్కూల్‌లో చేరి షూటింగ్ అభ్యాసం ప్రారంభించాడు.

క్రీడా జీవితం

బింద్రా ప్రతిభను మొదట గుర్తించినది అతడి తొలి కోచ్ జె.ఎస్.థిల్లాన్.[5] 2000 ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్న పిన్న భారతీయుడు బింద్రానే.[6] అర్హత రౌండులో 590 పాయింట్లు నమోదుచేసి 13వ స్థానంలో నిలిచాడు. దానితో ఫైనల్లో (తుది ఎనిమిది మందిలో) స్థానం పొందలేకపోయాడు.[7]

అంతర్జాతీయ ప్రతిభ

2001లోనే బింద్రా అంతర్జాతీయ పోటిలలో ఆరు స్వర్ణాలు సాధించాడు. 2002లో మాంచెస్టర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో ప్పెయిర్స్ విభాగంలో స్వర్ణాన్ని, వ్యక్తగత విభాగంలో రజత పతకాన్ని సాధించాడు. 2004 ఒలింపిక్ క్రీడలలో 597 పాయింట్లతో ప్రాథమిక రౌండులో మూడో స్థానాన్ని పొందినాడు. ఫైనల్లో కేవలం 97.6 పాయింట్లు మాత్రమే సాధించడంతో చివరికి 7వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.[8] 2006లో మెల్బోర్న్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో అభిజిత్ బింద్రా మరోసారి గత క్రీడలలొ సాధించిన విధంగా పెయిర్స్ విభాగంలో స్వర్ణాన్ని, వ్యక్తిగత విభాగంలో రజతాన్ని పొందినాడు. అదే ఏడాది దోహాలో జరిగిన ఆసియా క్రీడలలో వెన్నునొప్పి కారణంగా బింద్రా తప్పుకున్నాడు.

2008 బీజింగ్ ఒలింపిక్ క్రీడలు

2008లో బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పాల్గొన్న అభినవ్ బింద్రా తన చిరకాల వాంఛ నెరవేర్చుకొనడమే కాకుండా క్రీడా భారతావనికి కూడా పేరు తెచ్చాడు. ఇంతవరకు ఏ భారతీయ క్రీడాకారుడు సాధించని వ్యక్తిగత ఒలింపిక్ స్వర్ణపతకం సాధించి తన పేరిట ఒక కొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకూ అంతగా పేరుప్రఖ్యాతలు పొందని బింద్రా తన తండ్రి ఐదేళ్ళ వయస్సులోనే చెప్పిన సైలెంట్ కిల్లర్ భావనను నిజం చేశాడు. ప్రాథమిక రౌండులో 596 పాయింట్లతో నాలుగవ స్థానంలో ఉన్న బింద్రా ఫైనల్లో 104.5 పాయింట్లు సాధించి మొత్తం 700.5 పాయింట్లతో లక్ష్యాన్ని సాధించి స్వర్ణాన్ని ఎగరేసుకున్నాడు.

సాధించిన అవార్డులు

  • 2000: అర్జున అవార్డు.
  • 2001: రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు.

మూలాలు

  1. Athlete Biography: Abhinav Bindra. బీజింగ్ 2008 ఒలింపిక్ క్రీడల అధికారక వెబ్‌సైట్
  2. Medalists - India, బీజింగ్ 2008 ఒలింపిక్ క్రీడల అధికారక వెబ్‌సైట్
  3. [1]
  4. Abhinav Bindra's parents feeling on top of the world
  5. www.pr-inside.com/abhinav-bindra-win-gold-in-beijing-r747506.htm|title=Abhinav Bindra win gold in Beijing|date=August 11, 2008 |accessdate=2008-08-11
  6. www.iloveindia.com/sports/shooting/shooters/abhinav-bindra.html
  7. www.rediff.com/sports/2000/sep/18bindra.htm|publisher=Rediff|date=2000-09-18|accessdate=2008-08-11|title=China grabs gold, Bindra places 11th in shooting
  8. www.rediff.com/sports/2004/aug/16oly-shoot.htm|title=Bindra finishes seventh|publisher=Rediff|date=2004-08-16|accessdate=2008-08-11