వికీపీడియా:రచ్చబండ (పత్రికా సంబంధాలు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
 
(10 వాడుకరుల యొక్క 40 మధ్యంతర కూర్పులను చూపించలేదు)
పంక్తి 1: పంక్తి 1:
{{అడ్డదారి|[[WP:VPPR]]}}
{{రచ్చబండ}}
{{రచ్చబండ}}
{{Archives||auto=yes}}
{{కొత్త విభాగము | వ్యాఖ్య=కొత్త చర్చ ప్రారంభించండి}}
==పత్రికా సంబంధాలు==
[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] మరియు నేను [[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] గారితో హైదరాబాదులో జరిపిన చర్చల అనంతరం ఈ విభాగాన్ని ప్రారంభించాను. సభ్యులు గమనించగలరు.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 12:09, 7 ఫిబ్రవరి 2015 (UTC)
: వికీపీడియాలో వార్తలకు ముడిసరుకుగా పనికివచ్చే చాలా ఘటనలే జరుగుతున్నాయి. వికీ బయట జరిగే సమావేశాలు వంటివే కాకుండా వికీలో జరిగేవి కూడా భాషాభివృద్ధికి, తెలుగులో విజ్ఞానం అభివృద్ధికి కూడా పనికివస్తూండడంతో తెవికీ వివరాలు చాలావరకూ పత్రికల్లో పడదగ్గవే. తద్వారా తెవికీ ప్రగతి, తెవికీలో పనిచేయగలరన్న విషయం, వికీ నాణ్యత వంటి విషయాలు పాఠకులకు తెలుస్తాయి. కానీ ఈ వివరాలను మనం సరైన పత్రికావిలేకరుల చెంతకు తీసుకుపోవడంలో వెనుకబడివున్నామన్నది నా గమనింపు. ఈ విషయాన్ని 2015 జనవరి 10న హైదరాబాద్‌లో నేనూ, రాజశేఖర్ గారూ వ్యక్తిగతంగా కలిసిన సందర్భంగా చర్చించాము. తెవికీ సముదాయం సభ్యులు విడివిడిగా వివిధ విషయాలపై పత్రికలకు తెలియపరచడానికి అర్హులే అయినా తెవికీ సముదాయాన్ని ప్రతిబింబిస్తూన్న పత్రికా ప్రకటనలు తయారుచేసేందుకు, అందరి అనుమతితో పంపేందుకు చర్చించే వేదికగానూ, తెవికీ గురించి, సముదాయ సభ్యుల గురించి వెలువడ్డ వార్తాపత్రికా కథనాలు వంటివి పొందుపరిచేందుకు ప్రారంభించాము.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 16:24, 7 ఫిబ్రవరి 2015 (UTC)
:::చాలాకాలము నుండి దాదాపు నేను వికీకి వచ్చినప్పటి నుండేమో, (నాకు పత్రిక, మీడియా, సినిమా మాధ్యమాల నందు ప్రచారం అంటే మక్కువ కాబోలు) ఈ విషయము మీద చర్చించుతూనే ఉన్నాను. స్పందనలు తెలియజేయగలరు. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 01:46, 8 ఫిబ్రవరి 2015 (UTC)
== గౌతమీ గ్రంథాలయంలో అవగాహన కార్యక్రమం పత్రికా ప్రకటన ==
=== పత్రికా ప్రకటన ===
బుధవారం స్థానిక గౌతమీ గ్రంథాలయం పత్రికా విభాగంలో తెలుగు వికీపీడియా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని వికీమీడియా ఫౌండేషన్ ఐఈగ్రాంటీలు, తెలుగు వికీపీడియా రచయితలు బేసె కాశీవిశ్వనాథ్, సూరంపూడి పవన్ సంతోష్ సంధానకర్తలుగా వ్యవహరించారు. కార్యక్రమాన్ని తెలుగు వికీపీడియా అభివృద్ధికి గాను గ్రంథాలయ పుస్తక జాబితా ప్రాజెక్టులో భాగంగా విశ్వనాథ్ నిర్వహించారు. కార్యక్రమానికి గౌతమీగ్రంథాలయ సంస్థ గ్రంథపాలకులు వెన్నేటి శ్రీసూర్యనారాయణమూర్తి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో విశ్వనాథ్ మాట్లాడుతూ తెలుగు వికీపీడియాలో పుస్తకంలో, వైబ్సైట్లలో, మేగజైన్లలో దొరికే సమాచారాన్ని ఆధారం చేసుకుని ఎవరైనా వ్రాయవచ్చని సూచించారు. ప్రస్తుతం తెవికీ(తెలుగు వికీపీడియా) సభ్యులు వ్యాసాల్లో ఫోటోలు చేర్చాలన్న ప్రయత్నాలు చేస్తున్నారని, ఎవరైనా తాము తీసిన విలువైన ఫోటోలు ఫేస్బుక్ లో మాత్రమే కాకుండా కామన్స్.వికీపీడియా.ఆర్గ్ లో చేర్చాలని విజ్ఞప్తిచేశారు. పవన్ సంతోష్ మాట్లాడుతూ గౌతమీ గ్రంథాలయం ఎన్నోఏళ్ళ నుంచి తెలుగుకు చేస్తున్న సేవలను అంతర్జాల యుగంలో కూడా కొనసాగిస్తోందని కొనియాడారు. వికీపీడియా అంటే ఏమిటి, దాని వల్ల ఉపయోగాలు, తెవికీలో ఎలా రావచ్చు, తెలుగు టైపింగ్ సులభంగా ఎలా చేయవచ్చు, తెవికీలో సమాచారం చేర్చడం వల్ల విద్యార్థులకు ఉపయోగాలు వంటి విషయాలపై అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. కార్యక్రమంలో ఉచితంగా దొరికే తెలుగు సాఫ్ట్వేర్ల వివరాలు, వాడకం, ఎక్సెల్, వర్డ్ వంటి వాటిలో తెలుగును ప్రతివారూ 5 నిమిషాల్లో చేర్చడం అంశాలను కూడా చేసి చూపారు. మధ్యాహ్నం ఔత్సాహికులు, విద్యార్థులకు ఉచితంగా తెలుగులో వ్రాయడం, తెలుగు వికీపీడియాలో వ్యాసాలు అభివృద్ధి చేయడం వంటి అంశాలపై విశ్వనాధ్, పవన్ సంతోష్ శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో సీతంపేట గ్రంథపాలకులు మారిశెట్టి సత్యనారాయణ, ఆర్.వి.ఆర్.ఎస్.ఎస్.శర్మ, తదితర సిబ్బంది, విద్యార్థులు, పుస్తకప్రియులు హాజరయ్యారు.<br />
--[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 07:26, 18 మార్చి 2015 (UTC)
== లక్షపదాలకు చేరిన తెలుగు విక్ష్నరీ ==
వికీపీడియన్ల స్వచ్ఛంద కృషితో ఎవరైనా మార్పులు చేర్పులు చేయదగ్గ పద్ధతిలో తయారుచేసిన బహుభాషా స్వేచ్ఛానిఘంటువు తెలుగు విక్ష్నరీ లక్షపదాల మైలురాయిని చేరుకుంది. విక్ష్నరీ అనే పదం వికీ-డిక్ష్నరీ పదాల కలయికగా ఏర్పడింది. వికీ అంటే స్వేచ్ఛా విజ్ఞానాన్ని, ఎవరైనా మార్చదగ్గ మాధ్యమాన్ని సూచించే పదం కాగా దానికి డిక్షనరీ అనే పదాన్ని కలిపి దీన్ని రూపొందించారు. అందరికీ విజ్ఞానం అందాలి-అందరూ విజ్ఞానాన్ని పంచాలి అన్న నినాదంతో సాగుతున్న వికీపీడియాకు ఇది సోదర ప్రాజెక్టు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 96 భాషలలో వున్న ఈ విక్ష్నరీలు అర్థంతో పాటుగా ఉచ్ఛారణ, ఎటిమాలజీ, వ్యాకరణ విభాగాలు, నానార్థాలు వంటి భాషా విభాగాలతో సహా పదాలకు వేర్వేరు పేజీలు తయారుచేసి అభివృద్ధి చేయాలన్న ప్రయత్నంతో ముందుకు సాగుతోంది.
=== సామాన్యులే మాన్యులై చేస్తున్న కృషి ===
సాధారణంగా డిక్ష్నరీలను తయారుచేయడం భాషావేత్తలో, మహాపండితులో పూనుకోవలసిన పనిగా భావిస్తూంటారు. అతికొద్దిమంది ఉండే ఈ పండితులో, భాషావేత్తలో నిర్మించడం వల్లనే గతంలో తెలుగుభాషకు సమగ్రమైన నిఘంటువుల నిర్మాణం అందని మానిపండుగా మిగిలిపోయింది. ఐతే విక్ష్నరీని మాత్రం స్వచ్ఛందంగా ముందుకువచ్చి భాషాభివృద్ధిని మాత్రమే కాంక్షించే సాధారణమైన వ్యక్తులే నిర్మిస్తున్నారు. దీనిని నిర్మించే క్రమంలో వారు పలు నిఘంటువులను సంప్రదించడం, ఎటిమాలజీని తయారుచేసేందుకు ఆంగ్లవిక్షనరీలో అనుసరిస్తున్న విధానాలను స్వీకరించడం, ఇతర భాషల విక్షనరీలో పనిచేస్తున్న భాషాశాస్త్రవేత్తల సహకారం తీసుకోవడం వంటివి చేస్తూన్నారు. అంతేకాక హైదరాబాద్ నగరానికి చెందిన పాథాలజిస్ట్ డాక్టర్.రాజశేఖర్ విక్ష్నరీని అభివృద్ధి చేసే క్రమంలో తెలుగు భాషావేత్తలను సంప్రదించి మరీ విక్ష్నరీలో కృషిచేశారు. వారిలో ముఖ్యంగా హోసూరు నివాసియైన భాషావేత్త కె.నారాయణ పిళ్ళెను ప్రతి ముఖ్యమైన ప్రయత్నంలోనూ, పదాల ఎటిమాలజీల నిర్ధారణలోనూ, ఇతర వ్యాకరణాది అంశాలలోనూ ఫోన్ ద్వారా సంప్రదించి విక్ష్నరీని సమగ్రం చేస్తున్నారు. నారాయణ పిళ్ళై ఈ ప్రయత్నానికి ఎంతగానో సంతోషించి తమ పూర్తి సహకారాన్ని, రిఫరెన్స్ పుస్తకాల వివరాలని అందించి కృషిలో పరోక్షంగా భాగంపంచుకుంటున్నారు. తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవాల సందర్భంగా తిరుపతిలో వికీపీడియన్ల సమక్షంలో జరిగిన సభకు ఆయన ప్రత్యేకంగా విచ్చేసి వికీపీడియన్లను వ్యక్తిగతంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''"తెలుగు భాషా సంబంధమైన విషయాలలో విక్ష్నరీలో కృషిచేస్తున్న రాజశేఖర్ వంటివారు అడిగిన ప్రశ్నలు..... సందేహాలు..... పెద్ద పెద్ద భాషా పండితుల చర్చలలో మాత్రమే ఉటంకించ బడేవని, అటు వంటి ప్రశ్నలు, సందేహాలు..... భాషా పండితులు కాని వీరికి రావడమే వీరు చేస్తున్న కృషి ఎంత పెద్ద ప్రయత్నమో తెలుపుతోందని వీరు చేస్తున్న కృషి చాల గొప్పదని"'' పేర్కొన్నారు.
=== విక్ష్నరీ నిర్మాణంలో ముఖ్యులు ===
తెలుగు వికీపీడియాలో విశిష్టమైన కృషి చేస్తున్న భాస్కరనాయుడు (హైదరాబాద్), డా.రాజశేఖర్ (హైదరాబాద్), మాకినేని ప్రదీప్, అర్జునరావు(బెంగళూరు), టి.సుజాత(చెన్నై), జె.వి.ఆర్.కె.ప్రసాద్(విజయవాడ), పాలగిరి రామకృష్ణారెడ్డి(అనపర్తి) వంటీవారే విక్ష్నరీని తీర్చిదిద్దేందుకూ కృషిచేశారు. వేర్వేరు వృత్తులు, వేర్వేరు ప్రాంతాల్లో ఉండే వీరందరూ స్వచ్ఛంద కృషితో ఈ బహుభాషా నిఘంటువును అభివృద్ధి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న ఈ అంతర్జాల నిఘంటువుల కృషిలో తెలుగును కూడా ముందుకుతీసుకువెళ్ళి అంతర్జాతీయంగా తెలుగు పదాలను కూడా ఈ విస్తృతమైన కృషిలో భాగం చేయాలన్న తపన వీరిని నడుపుతోంది. వేర్వేరు వృత్తుల్లో, తమ జీవితాల్లో నిత్యం బిజీగా ఉంటున్నా తమకున్న సమయాన్ని వీలున్నంతవరకూ మిగుల్చుకుని దానిలోనే భాషా సేవ సాగిస్తున్నారు.
=== పదేళ్ళ కృషి ===
తెలుగు విక్ష్నరీ 2005 సమయంలోనే ప్రారంభమైంది. తొలిదశలో మాకినేని ప్రదీప్, వైజా సత్య, చదువరి ఖాళీపేజీలు ఏర్పాటుచేసి, మూసలు(టెంప్లేట్స్) తయారుచేసి, ప్రాజెక్టు నిర్వహణకు కీలకమైన మౌలిక పాలసీ చర్చలు చేసి పునాదివేశారు. 2007లో ఆగస్ట్-అక్టోబర్ మధ్యకాలంలో మాకినేని ప్రదీప్ బ్రౌణ్య నిఘంటువుని విక్ష్నరీలో చేరుస్తూ చాలా పదాలను మౌలిక స్థితిలో అభివృద్ధి చేశారు. వీటిలో గణనీయమైన సంఖ్యలో ఆంగ్లంలో పర్యాయపదాలు కూడా ఉన్నాయి. ఆంగ్ల పదాలకు తెలుగు వివరణలు చేరుస్తూ కూడా కొన్నిటిని అభివృద్ధి చేశారు. ఇటువంటీ కొన్ని గట్టి కృషి ప్రయత్నాలు ఉన్నా మొదటి ఐదు సంవత్సరాలను నిద్రాణమైన స్థితి అనే చెప్పుకోవచ్చు. 2011 నుంచి తెలుగు విక్ష్నరీలో టి.సుజాత, డా.రాజశేఖర్, పాలగిరి, జె.వి.ఆర్.కె.ప్రసాద్ కృషితో గణనీయమైన స్థితికి అభివృద్ధి చెందింది. వీరి కృషి ఫలితంగా 25వేల పదాలు పైగా చేరాయి. ఐతే ఈ దశలో గణనీయమైన కృషి చేస్తున్న జె.వి.ఆర్.కె.ప్రసాద్ అనారోగ్య స్థితిగతుల దృష్ట్యా ఏడాదిపాటు ఆయా కార్యకలాపాలకు దూరంగా ఉండడంతో కొంత మందకొడి స్థితి ప్రారంభమైంది. సరిగా ఇదే సమయం(2012)లో విక్ష్నరీలో సభ్యత్వం స్వీకరించిన భాస్కరనాయుడు అత్యంత వేగవంతంగా అభివృద్ధి చేయడం ప్రారంభించారు. ఆయన రాజశేఖర్‌ని "తెలుగు విక్ష్నరీ కొద్దిమంది సభ్యులతో నెట్టుకొస్తున్న స్థితిలో ఏం చేస్తే అభివృద్ధి చెందుతుందన్న" చర్చ లేవదీసినారు. రాజశేఖర్ భాస్కరనాయుడుకు తనవద్దవున్న వేయిపుటల ఆంగ్ల-తెలుగు నిఘంటువు అందించి, మౌలికమైన అవగాహన కల్పించగా భాస్కరనాయుడు అత్యంత వేగంగా పేజీలు అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆయన వేలాదిపదాలు చేరుస్తూ పోయారు. ఆ నిఘంటువు పనిని ఆయన ఆరు నెలల కొద్ది వ్యవధిలోనే పూర్తిచేయడం విక్షనరీ వేగం పుంజుకునేలా చేసింది.
=== సమస్యలు అధిగమిస్తూ.. ===
విక్ష్నరీలో పలు సందర్భాల్లో సాంకేతిక, పాలసీ పరమైన సమస్యలు ఎదురైనప్పుడు పలువురు వికీపీడియన్ల చొరవ, చర్చలు, కృషి ఫలితంగా వాటీని పరిష్కరించుకున్నారు. 2013లో విక్ష్నరీలో ఉన్న పదాల కన్నా కొన్ని వేల పదాలు తక్కువగా గణాంకాలు కనిపించడమనే సాంకేతిక సమస్య ఎదురైంది. ఈ విషయాన్ని పరిష్కరించేందుకు సీనియర్ వికీపీడియన్ అర్జున రావు ప్రయత్నించారు. ఒక పేజీలో ఉన్న పదాలకు, వాటీ అర్థాలు తెలిపే పేజీలకు ఉండాల్సిన అంతర్ వికీ లంకెలు లేకపోయిన ప్రతిపేజీని గణాంకాలలో లెక్కించట్లేదన్న సంగతి ఆయన సాంకేతికంగా కొన్ని ప్రయత్నాల ద్వారా కనిపెట్టగలిగారు. దీన్ని నివారించేందుకు విక్ష్నరీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న భాస్కరనాయుడు, రాజశేఖర్ అవిరళంగా శ్రమించి ప్రతిపేజీ తెరచి లంకెలు లేనిపేజీల్లో చేరుస్తూ పోయారు. ఆ విధంగా ఆ సమస్య తీరింది. అలానే విక్ష్నరీలో తొలినుంచీ ఐదుగురే క్రియాశీలక సభ్యులు రాస్తూండడాన్ని గమనించిన భాస్కరనాయుడు విజయవాడలోని తెవికీ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న గుళ్ళపల్లి నాగేశ్వరరావును ప్రోత్సహించి ఆయనకీ విక్ష్నరీలో అవగాహన కల్పించి చేర్చారు. ఆపై గుళ్ళపల్లి నాగేశ్వరరావు విక్ష్నరీలో అత్యధిక మార్పులు చేసిన వ్యక్తులలో ఒకరిగా నిలవడం విశేషం.
=== ప్రణాళికాయుతమైన అభివృద్ధి ===
విక్ష్నరీలో పనిచేసేది కొద్దిమందే అయినా ఉన్నవారంతా ప్రణాళికాయుతంగా తమ శక్తిసామర్థ్యాలు జాగ్రత్తగా అంచనావేసుకుని ఈ అభివృద్ధి సాధించారు. విక్ష్నరీ సభ్యుల్లో భాస్కరనాయుడు లక్షకు పైగా మార్పులు చేర్పులు చేసి మార్పులు చేర్పుల్లో అగ్రస్థానంలో కొనసాగుతూండగా వారి తర్వాతి స్థానాల్లో జెవిఆర్‌కె ప్రసాద్, రాజశేఖర్, టి.సుజాత, గుళ్ళపల్లి నాగేశ్వరరావు, మాకినేని ప్రదీప్ వంటివారున్నారు. భాస్కరనాయుడు 37,265 కొత్త వ్యాసాలను విక్ష్నరీలో తయారుచేశారు. ఆయన ఈ క్రమంలో తెలుగు విక్ష్నరీకి నిర్వాహకునిగా పనిచేశారు. రోజుకు కొన్ని గంటల సమయాన్ని విక్ష్నరీకే వెచ్చిస్తూ ఆయన విక్ష్నరీ అభివృద్ధికి ఇతోధికంగా సహకరించారు.
=== తెలుగు నిఘంటువుల్లో లేని ప్రత్యేకతలు ===
సాంకేతిక యుగంలోని అవకాశాలను అందిపుచ్చుకుంటూ తెలుగు విక్ష్నరీ ముద్రిత నిఘంటువులకు లేని కొన్ని ప్రత్యేకతలను సాధిస్తోంది.
ఆంగ్ల విక్షనరీ నుండి కొన్ని ప్రామాణికమైన వాటిని ముద్రిత నిఘంటువులలో లేని విశేషాల్ని తెలుగు విక్షనరీలో ప్రారంభించాము, వీటిలో కొన్ని ప్రయత్నాలను డా.రాజశేఖర్ ఇతర భాషల విక్ష్నరీలలో పనిచేస్తున్న భాషావేత్తలతో ఆన్లైన్లో సంప్రదించి, వారి కృషిని తెలుసుకుని ప్రవేశపెట్టారు. వాటిలో కొన్ని
* తెలుగువారి వ్యక్తిగత మరియు ఇంటి పేర్లు: అలాసడైర్ అనే వికీమీడియన్ చేసిన కృషి స్పూర్తితో స్టీఫెన్ బ్రౌన్ అనే వికీమీడియన్ ప్రోత్సాహంతో తెలుగువారిలో స్త్రీపురుషుల వ్యక్తిగత పేర్లు మరియు ఇంటిపేర్లకు ఒక అనుబంధంగా తెలుగు విక్షనరీలో ప్రారంభించాము. దీనిని అనుబంధం:పేర్లు వద్ద సభ్యులు తిలకించవచ్చును. తెలుగు భాషా పరిశోధనలో పేర్లు గురించిన ఒక విభాగమైన ఒనొమాటోపియా (Onomatopoeia) లో కృషిచేస్తున్న వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
* విభక్తులు సాధారణంగా నిఘంటువులలో కనిపించవు. కానీ ఒక భాషను నేర్చుకోవాలంటే ఇవి తెలియడం చాలా అవసరం. స్టీఫెన్ బ్రౌన్ ప్రోత్సాహంతో కొన్ని నామవాచకాలు ఎనిమిది విభక్తులలో ఏకవచన మరియు బహువచన ప్రయోగంలో ఎలా మారుతుంటాయి అని తెలుసుకోవచ్చును. ఉదా: రాముడు, కృష్ణుడు
* క్రియలు వాటి యొక్క క్రియా రూపాలు నిఘంటువులలో కనిపించవు. ఇలా క్రియలు ప్రథమ పురుష, ఉత్తమ పురుష మరియు మధ్యమ పురుషలలో ఏకవచన మరియు బహువచనాలలో, భూత, భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎలా మార్పుచెందునో తెలుసుకోవచ్చును. ఉదా: చేయు
* అంతర్జాతీయ ఉచ్చారణ సంఘం (International Phonetic Association) ఒక భాషకు చెందిన అక్షరాలను మరియు పదాలను ఎలా పలకాలో నిర్ణయిస్తుంది. దీనికోసం ఆయా అక్షరాలు వ్రాసే విధానం వేరుగా ఉంటుంది. ఆ పద్ధతిలో వ్యాసినట్లయితే తెలుగుభాష రానివారు కూడా ఆ పదాన్ని ఎలా పలకాలో తెలుసుకొనవచ్చును. అంతే కాకుండా బొంబాయిలో నివసిస్తున్న మురళి మరియు శ్రీఫణి దంపతుల సహకారంతో ఒక వెయ్యి పదాలకు ఆడియో ఫైల్స్ తయారుచేసి, వాటిని వికీ కామన్స్ లోని అప్లోడ్ చేసి ఆయా పదాలలో చేర్చాము. ఈ మూల పదాలను ఎవరైనా మీటనొక్కి వినవచ్చును. ఉదా: ఊయల
* తెలుగు భాషలోని పదాల వ్యుత్పత్తి (Etymology) ఒక ప్రత్యేకమైన పరిశొధనాంశము. తెలుగు భాషా పదాలు ఎక్కువగా సంస్కృతం నుండి ఉద్భవించినా; ప్రస్తుత కాలంలొ చాలా ఆంగ్ల పదాలు తెలుగులో స్థిరపడుతున్నాయి. ఈ దిశగా కొంత ప్రవేశాన్ని కూడా తెలుగు విక్షనరీలో కలిగించాము. ఉదా: అగ్ని, క్షేత్రము. ఈ విధంగా ఒక భాషకు చెందిన పదాలను వాటి మూల భాషా పదాల వరకే కాకుండా వాటి మూల శబ్దాల (Roots) వరకు తీసుకొనిపోవచ్చును.
* బహువచన శబ్దాలను వాటి ఏకవచన శబ్దాలకు దారిమార్పు పేజీలుగా మార్చకుండా ఆయా శబ్దాలను ఫలానా పదం యొక్క బహువచన రూపం అని వ్రాయడం ద్వారా బహువచన పదాలన్నింటిని ఒకే దగ్గర చేర్చుకొనే అవకాశం కలుగుతుంది. అలాగే తెలుగులో బహువచనాలు రెండు రకాలుగా ఉన్నాయి. ఉదా: ముఖము కు బహువచనం ముఖములు, ముఖాలు మొదలైనవి.
* బొమ్మలు సామాన్యంగా ఇతర నిఘంటువులలో కనిపించవు. కారణాలు అనేకం. ఇవి పిల్లల పుస్తకాలలో ఎక్కువగా కనిపిస్తాయి. నిఘంటువులోని పదానికి బొమ్మ గనుక ఉంటే సుళువుగా అర్థం అవుతుంది. ఇది బహుభాషా నిఘంటువు గనుక, తెలుగేతరులు చూసినప్పుడు ఆ యా పదాలు సులభముగా అర్థం కావడానికి ఈ బొమ్మలు ఉపకరిస్తాయి. పదానికి సంబంధించిన వివరాలు ఎక్కువగా వ్రాయాల్సిన అవసరం తగ్గుతుంది. ఇప్పటికే సుమారు ఒక వెయ్యి బొమ్మలున్నా కూడా, ఆ దిశగా ఎవరైనా కృషిచేసి తెలుగు విక్షనరీని ఇంకా మెరుగుపరచవచ్చును.<br />
--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 11:44, 8 ఏప్రిల్ 2015 (UTC)


== తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం సందర్బంగా విలేఖరులతో ఒక ప్రత్యేక కార్యక్రమం ==
== పిఠాపురంలో వికీ పీడియా అవగాహనా కార్యక్రమం పత్రికా ప్రకటన ==


తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం సందర్భంగా విలేఖరులతో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం చాలా ముఖ్యం. ఈ కార్యక్రమం ద్వారా తెలుగు వికీపీడియా యొక్క ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయవచ్చు.ఈ కార్యక్రమంలో వికీపీడియా సభ్యులు, వికీపీడియా నుండి ప్రయోజనం పొందిన వ్యక్తులు మరియు వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొనవచ్చు.
=== "పిఠాపురం ప్రాంతం గురించి వికీలో రాయాలి" ===
ఈ కార్యక్రమం ద్వారా తెలుగు వికీపీడియా గురించి ప్రజల్లో అవగాహన పెరగడానికి మరియు మరింత మంది వారు వికీపీడియాలో సహకరించడానికి ప్రేరేపించడానికి సహాయపడుతుంది. అంతే కాక రాబోవు ఎన్నికల కోసం కూడా తెలుగు వికీపీడియాలో విలువైన సమాచారం ఉన్నది, దీని కోసం తెవికీ అభివృద్ధికి తోడ్పడుతూ స్వతహాగా జర్నలిస్ట్‌ అయిన అయిన @[[వాడుకరి:Batthini Vinay Kumar Goud|Batthini_Vinay_Kumar_Goud]] గారిని ఈ విషయంలో దిశానిర్దేశం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను, [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 10:01, 16 అక్టోబరు 2023 (UTC)
పిఠాపురంలో ఆధ్యాత్మిక ప్రదేశాలకు, చారిత్రిక విశేషాలకు, సాహిత్యచరిత్రలో నిలిచే వ్యక్తులకు కొదవలేదని, కాకుంటే వాటి గురించి స్వేచ్ఛావిజ్ఞాన సర్వస్వమైన తెలుగు వికీపీడియాలో రాస్తే ప్రపంచానికి తెలియజెప్పినవారం అవుతామని వికీమీడియా ఫౌండేషన్ ఐఈగ్రాంటీ, సీనియర్ వికీపీడియన్ [[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|బి.కె.విశ్వనాధ్]] పేర్కొన్నారు. పిఠాపురంలోని చారిత్రిక ప్రశస్తిపొందిన సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలోని చెలికాని భావనరావు సభాసదనంలో ఆదివారం వికీపీడియా అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమ నిర్వహణా బాధ్యతలు వికీపీడియా స్వచ్ఛంద రచయిత విశ్వనాధ్ వహించారు. పలువురు సాహిత్యాభిమానులు, గ్రంథాలయ పాఠకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వికీపీడియాలో చేరదగ్గ ప్రాధాన్యత కలిగిన ఆలయాలు, మఠాలు, పీఠాలు, సంస్థానం వంటివి పిఠాపురంలో ఉన్నాయని, వీటిలో కొన్నిటికి ఒక్కో విషయానికి ఒక్కో వ్యాసం ఉండదగ్గ అర్హత ఉందన్నారు. పిఠాపురం సంస్థానంలో ఆస్థాన కవులుగా వ్యవహరించి, తిరుపతి వెంకటకవులకే సవాలు విసిరిన వేంకట రామకృష్ణకవులు, రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన మహాకవి ఉమర్ ఆలీషా వంటివారు పిఠాపురం వాస్తవ్యులేనని తెలిపారు. వీరందరి గురించి మరింత సమాచారం వ్రాయాలని, ప్రస్తుతం విద్యార్ధులంతా కంప్యూటర్లు స్మార్ట్ ఫోన్లు వాడుతున్న నేపద్యంలో తెలుగు కంప్యూటర్లలో వ్రాయటం ఎంతో సులభం అని, విద్యార్ధులంతా ఆ దిశగా కృషి చేయాలని చెపుతూ, వికీపీడియా ద్వారా ఉన్న అనేక వేల వ్యాసాల నుండి సమాచారాన్ని ఉపయోగించుకోవాలని, మరిన్ని వ్యాసలను మెరుగుపరచడానికి కంప్యూటర్లలో తెలుగు వ్రాయటం అలవాటు చేసుకోవాలని శ్రోతలను, విద్యార్ధులను ప్రోత్సహించారు. కార్యక్రమంలో భాగంగా పట్టణానికి చెందిన సీనియర్ వికీపీడియన్, [[వాడుకరి:Rajachandra|రాజాచంద్ర]] మాట్లాడుతూ తెలుగు వికీపీడియాలో వ్రాయడం ద్వారా ఎవరైనా పంచుకోదగ్గ విలువైన వ్యాసాలను తయారుచేసి తెలుగువారందరికీ కానుకగా సమర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. మన భాషకి, మన సంస్కృతికి విశ్వవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకువచ్చిన కృషిలో భాగమయ్యామన్న తృప్తి దీనివల్ల దక్కిందని తెలిపారు. పట్టణ ప్రముఖులు పత్రి రామకృష్ణ, రెడ్డెం శేషగిరిరావు, కండిపల్లి వెంకటరమణ, గ్రంథాలయ కార్యదర్శి కొండేపూడి శంకరరావు, గ్రంథాలయాధికారి మల్యాల శ్రీనివాస్ కార్యక్రమంలో మాట్లాడారు.


:@[[వాడుకరి:Kasyap|Kasyap]] గారు ఎన్నికల సందర్బంగా కొద్దిగా బిజీ ఉండడం వల్ల రిప్లై ఇవ్వలేక పోయాను. మీరు ప్రస్తావించిన కార్యక్రమ ప్రస్తుత ఎన్నికల సమయంలో కష్టమే కావొచ్చు, కానీ ఎన్నికల తరువాత తప్పకుండా ఈ కార్యక్రమం నిర్వహిద్దాం. [[వాడుకరి:Batthini Vinay Kumar Goud|Batthini Vinay Kumar Goud]] ([[వాడుకరి చర్చ:Batthini Vinay Kumar Goud|చర్చ]]) 09:13, 21 అక్టోబరు 2023 (UTC)
=== పిఠాపురం సాహిత్యవేత్త ఓలేటి పార్వతీశం వ్యాస సృష్టి ===
:@[[వాడుకరి:Kasyap|Kasyap]] గారూ, తెలుగు వికీపీడియా వార్షికోత్సవం గురించి చర్చల్లో ప్రస్తావించండి సార్. ఇందుకు ప్రయత్నిద్దాం. [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 15:04, 22 అక్టోబరు 2023 (UTC)
ఈ సందర్భంగా నిర్వహించిన తెలుగు వికీపీడియా శిక్షణ కార్యక్రమంలో భాగంగా విశ్వనాథ్, రాజాచంద్ర ఎటువంటి వ్యాసాలు సృష్టించవచ్చో, ఎలాంటి సమాచారం చేర్చాలో పాల్గొన్నవారికి వివరించారు. ఈ సందర్భంగా వికీపీడియాలో ఎవరైనా ఆధారాలు కలిగిన సమాచారం కొద్దిమాత్రమే తెలిసినా చేర్చవచ్చని, చిన్నగా ప్రారంభమైన వ్యాసాలే చినుకు చినుకు చేరి గోదావరిగా మారినట్టు పలువురు వికీపీడియన్లు క్రమంగా చేసిన అభివృద్ధి వల్ల పెద్ద వ్యాసాలుగా పరిపుష్టమవుతాయని వివరించారు. ఈ క్రమంలో పిఠాపురానికి చెందిన జంటకవులు వెంకట పార్వతీశకవుల గురించి మాత్రమే వ్యాసం ఉండడం, విడివిడిగా వారికి వ్యాసాలు లేకపోవడం గమనించి వారిలో ఒకరైన ఓలేటి పార్శతీశం గురించి వ్యాసాన్ని సభ్యునితో ప్రారంభింపజేశారు. వికీపీడియాలో చేర్చిన ఫోటోలకు కాపీహక్కులు ఉండవని, మన చుట్టుపక్కల ఉన్న విశిష్టమైన ప్రదేశాలకు సంబంధించి అటువంటి ఫోటోలు తీసి చేర్చడమూ చాలా విలువైన సేవేనని పేర్కొన్నారు.
--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 11:29, 12 ఏప్రిల్ 2015 (UTC)(విశ్వనాథ్ గారు పంపిన వివరాలతో)


== గ్రంథాలయ సర్వస్వం మాసపత్రిక నవంబర్ 2023 సంచికలో తెలుగు వికీపీడియా ప్రస్తావన ==
== ఈనాడు ఆదివారం, బతుకమ్మ సంచిక(నమస్తే తెలంగాణ)లకు స్పందన ==


గ్రంథాలయ సర్వస్వం అనే మాసపత్రిక నవంబర్ 2023 సంచికలో తెలుగు వికీపీడియా గురించిన ప్రస్తావన ఉంది. తెవికిలో సమాచారం కొరకు ఆ వ్యాసం మాత్రమే సేకరించి అప్లోడ్ చేసి [[:దస్త్రం:Adobe Scan 29 Apr 2024.pdf|లింక్]] ఇచ్చాను. ధన్యవాదాలు. [[వాడుకరి:Vjsuseela|వి.జె.సుశీల ]] ([[వాడుకరి చర్చ:Vjsuseela|చర్చ]]) 06:44, 29 ఏప్రిల్ 2024 (UTC)
''గమనిక:19 ఏప్రిల్ 2014న వెలువడ్డ [http://web.archive.org/web/20150419195557/http://eenadu.net/Magzines/SundaySpecialInner.aspx?qry=weekpanel1 ఈనాడు ఆదివారం], నమస్తే తెలంగాణ వారి [http://namasthetelangaana.com/Sunday/e%E0%B0%A6%E0%B0%BF%E0%B0%97%E0%B1%8B-%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%A5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF%E0%B0%82-10-9-476078.aspx#.VTTFBdKqqko బతుకమ్మ సంచికల్లో] కవర్ స్టోరీ ఈ-బుక్స్ గురించి ప్రస్తావించింది. తెలుగులో ఈ పుస్తకాల విషయంలో జరిగిన శ్రమను ఎంతో ప్రస్తావించి తెవికీసోర్సును గురించి ఏమీ లేకపోవడం కారణంగా ఆరోజు జరిగిన తెలుగు వికీ నెలవారీ సమావేశంలో జరిగిన చర్చలో భాగంగా [[వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ఏప్రిల్ 19, 2015 సమావేశం/ప్రధానాంశాలు|ఈ అంశంపై]] వారికి ఒక లేఖ(వచ్చేవారం సంచికలో ప్రచురణ జరిగేలా) పంపాలని నిర్ణయించాము. అందుకు అనుగుణంగా పంపేందుకు ఈ క్రింది టెక్స్ట్ తయారుచేస్తున్నాం''

గత ఆదివారం సంచిక కవర్ స్టోరీ ఈ-బుక్స్ మీద రాయడం బావుంది. పైగా గతవారం అంతర్జాతీయ పుస్తక దినోత్సవం జరగడం కూడా మీరు వేసిన వ్యాసానికి మంచి విలువ తెచ్చిపెట్టింది. ప్రింటు పుస్తకాల విలువను తెలియజెప్తూనే ఈ-పుస్తకాల గురించి కూడా చాలా సమన్వయంతో రాశారు. అయితే భవిష్యత్తులో అంతర్జాలం అభివృద్ధి చెందుతూండడంతో ఈ-బుక్స్ అవసరం మరింత పెరగుతుందని చెప్పవచ్చు. ఇక తెలుగు ఈ-పుస్తకాల విషయంలో జరుగుతున్న కృషిని, పలు ఈ-గ్రంథాలయాల వివరాలను చెప్పేప్పుడు తెలుగు వికీసోర్సు కృషిని కనీసం ప్రస్తావించి అయినా ఉండాల్సింది. 9,896 తెలుగు యూనీకోడ్ పాఠ్యపుపేజీలు, 20 అమోదించబడిన, 1 దిద్దబడిన, 29 టైపు పూర్తయిన మరియు 99 టైపు చేయబడుచున్న పుస్తకాలతో ఎవరైనా అభివృద్ధిపరచగల స్వేచ్ఛానకలు హక్కులున్నరచనలుగల ఇ-గ్రంథాలయంగా తెలుగు వికీసోర్సు నిలుస్తోంది. భారత డిజిటల్ లైబ్రరీ, ఆర్కైవ్స్.ఆర్గ్ మొదలుకొని మీరు ప్రస్తావించిన వాటిలో అత్యధికం కేవలం పీడీఎఫ్ లేదా జెపిజి ఫార్మాట్లో పుస్తకాలను అందిస్తాయి. వాటిలోని సమాచారాన్ని నెట్‌లో టైపింగ్ ద్వారా వెతకడం చాలా కష్టమయిన పని, కానీ వికీసోర్సు మాత్రం ఏ సెర్చింజన్ ద్వారానైనా వెతకగల యూనీకోడ్ పాఠ్యం రూపొందించేందుకు కూడా కృషి చేస్తోంది. పైగా కొన్ని గ్రంథాలయాల్లా కాక కేవలం కాపీహక్కులు లేని పుస్తకాలను మాత్రమే వినియోగదారులు అన్నివిధాలుగానూ వాడుకోగలగిన విధమైన పుస్తకాలే ఉంటాయి. ఈ గ్రంథాలయాన్ని స్వచ్ఛంద కృషి చేసే వికీమీడియన్ల ద్వారా రూపొందించారు. ఇన్ని ప్రత్యేకతలున్న వికీసోర్సును గురించి వివరించివుంటే వ్యాసానికి మరింత నిండుతనం లభించేది. ఏదేమైనా చాలా చక్కని ప్రయత్నం చేసినందుకు అభినందనలు.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 09:12, 20 ఏప్రిల్ 2015 (UTC)

:[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] గారు. పత్రికా సంభదాలు గురించి శ్రద్దగా రాస్తున్నందుకు కృతజ్నతలు..పైన పేర్కొన్న దానిలో మరొకటి చేర్చాలని నా యొక్క, [[వాడుకరి:Rajasekhar1961]] గారి యొక్క అభిప్రాయం - వికీసోర్స్ యొక్క గణాంకాలు, యునీకోడ్ పూర్తి కాబడిన పేజీలు, ఇప్పటికే చేర్చబడిన పిడిఎఫ్ పేజీలు ఎన్ని అనేవాటిని కూడా చేర్చాలనేది. దీనిపై సభ్యులు స్పందిస్తే, మార్పులు చేయవచ్చు...--[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 14:36, 20 ఏప్రిల్ 2015 (UTC)
:: [[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్ గారూ]] మీరన్న గణాంకాలు చేర్చాను.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 08:15, 22 ఏప్రిల్ 2015 (UTC)

== నగరంలోని మ్యూజియం కళాఖండాలను డిజిటల్ గా భద్రపరుస్తూ తెలుగు వికీపీడియా దినోత్సవ సంబరాలు ==

హైదరాబాద్: ఆదివారం తెలుగు భాషా వికీపీడియన్లు నగరంలోని పబ్లిక్ గార్డెన్సులోని డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాష్ట్ర ఆర్కియాలజీ మ్యూజియంలో విశిష్టమైన ఫోటో వాక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సచేతనంగా కృషిచేస్తున్న 45మందితో సహా 900కి పైగా స్వచ్ఛంద రచయితలు (తెవికీ భాషలో వాడుకరులు) కృషితో రూపుదిద్దుకున్న 62,500 వ్యాసాల తెలుగు స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం - తెలుగు వికీపీడియా. ప్రస్తుత విశిష్టమైన ఫోటో వాక్ కార్యక్రమం తెలుగు వికీపీడియా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు తెవికీ క్రియాశీల వాడుకరి (తెవికీపీడియన్ లేదా తెవికీ రచయిత), నాటకరంగ పరిశోధక విద్యార్థి వంగరి ప్రణయ్ రాజ్ కృషిచేస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొనేవారు గైడెడ్ టూర్ (పర్యటన)లో మ్యూజియంలో ప్రదర్శించిన కళాఖండాలు, చారిత్రిక వస్తువులు, ఆ ప్రాంతంలోని ముఖ్యమైన బిల్డింగులు, చారిత్రిక వ్యక్తుల విగ్రహాలు వంటివి ఫోటోలు తీస్తారు. ఆపైన ఫోటోలను సరైన వివరణలు పెడుతూ వికీపీడియా సోదర ప్రాజెక్టు అయిన వికీమీడియా కామన్స్(commons.wikimedia.org)లో చేరుస్తారు. తద్వారా మరింతమంది మ్యూజియంలోని కళాఖండాల గురించి వికీపీడియాలో వ్యాసాలు రాసేందుకు వీలుచిక్కుతుంది. ఈ కార్యక్రమం గురించి ప్రణయ్ రాజ్, "కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరికీ ప్రవేశం ఉంటుంది. పాల్గొనదలచినవారు te.wikipedia.orgలో "వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా దినోత్సవం 2015 - తెవికీలోకి చారిత్రిక ఛాయాచిత్రాలు" అన్న పేజీలో సంతకం చేసి కానీ, నేరుగా కానీ రావచ్చు. పాల్గొనేవారు మన సుసంపన్నమైన చరిత్రకు చెందిన ఫోటోలు తీసుకోవడం మాత్రమే కాకుండా మన నగరం, భాష, సాంస్కృతిక సంపద గురించిన సమాచారాన్ని వికీపీడియా, వికీమీడియా ప్రాజెక్టులు ఉపయోగించి ఎలా అభివృద్ధి చేయవచ్చో తెలుసుకుంటారు" అని పేర్కొన్నారు. బహుళ సంస్కృతుల సమాహారమైన, అత్యంత ముఖ్యమైన హైదరాబాద్ నగరంలో వివిధ ప్రదేశాల గురించి అంతర్జాలంలో దొరుకుతున్న సమాచారం ఇప్పటికీ తక్కువే ఉందని తెలిపారు. తనలాంటి పలువురు అంతర్జాలంలో తెలుగులో రాసేందుకు, సమాచారం అభివృద్ధి చేసేందుకు ఎవరైనా స్వేచ్ఛగా వినియోగించుకుని, రాయదగ్గ తెలుగు వికీపీడియాను ప్లాట్ ఫాంగా ఎంచుకుని https://te.wikipedia.org వద్ద రాస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ కు సంబంధించి దొరుకుతున్న 89వేల ఛాయాచిత్రాల్లో 89 మాత్రమే మంచి నాణ్యత కలిగి అందరికీ అందుబాటులో ఉన్నాయని వాపోయారు. వికీపీడియా వ్యాసాలు విజ్ఞాన సర్వస్వ తరహావి కావడంతో విద్యార్థులకు, పరిశోధకులకు, ఔత్సాహికులకు, ఇతర పాఠకులకు ఉపకరించే ఎంతో వాస్తవ సమాచారం అందులో దొరుకుతోందని ప్రణయ్ తెలిపారు.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె)]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 14:23, 11 డిసెంబరు 2015 (UTC)

== జాతీయ స్థాయి పోటీలో తెలుగు వికీపీడియా ఘన విజయం ==

పంజాబ్ ప్రాంతం గురించి వ్యాసాలు సృష్టించడంపై జరిగిన దేశవ్యాప్త పోటీలో తెలుగు వికీపీడియా సముదాయ పరంగా గొప్ప విజయం సాధించింది. గత వారంలో సాగిన మూడు రోజుల వికీకాన్ఫరెన్స్ ఇండియా ముగింపు ఉత్సవంలో వికీమీడియా ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్ అసఫ్ బార్టోవ్ చేతుల మీదుగా తెలుగు వికీపీడియన్లు ట్రోఫీని అందుకున్నారు. తెలుగులో దాదాపుగా 450 పైగా వ్యాసాలు సృష్టించి, విస్తరించడంతో ఇంగ్లీష్, మలయాళంతో పాటుగా సంయుక్తంగా బహుమతిని పంచుకుంది.

ప్రస్తుత పంజాబ్ రాష్ట్రం, పంజాబ్ ప్రావిన్సు, హిమాచల్ ప్రదేశ్ లో కొంతభాగం, హర్యానా మొత్తం కలిపిన విస్తృతమైన పంజాబ్ ప్రాంతం, సంస్కృతి, చరిత్ర, ఆహారం, వ్యక్తులు, ప్రదేశాలు వంటి అనేక విషయాల గురించి వ్యాసాలు సృష్టించడం, విస్తరించడంపై ఈ పోటీ పలు భాషా వికీపీడియాల మధ్య జరిగింది. పదికి పైగా వికీపీడియాలు పాల్గొన్న ఈ ఎడిటథాన్(వ్యాసాల్లో సమాచారం చేర్పు కొందరు వికీపీడియన్లు చేస్తూ పోతే ఎడిటథాన్ గా వ్యవహరిస్తారు) నెల రోజులకు పైగా సాగింది. దీనిలో తెలుగు వికీపీడియన్లు అత్యంత ఆసక్తితో, సమిష్టి కృషితో పాల్గొన్నారు. ఈ పోటీని తెలుగు వికీపీడియాలో ప్రణయ్ రాజ్ వంగరి, పవన్ సంతోష్ కలసి సమన్వయకర్తలుగా వ్యవహరించగా, నిర్వహణలో విశ్వనాథ్.బి.కె. సహకరించారు. పంజాబ్ అంశంపై వ్యాసాలు రాసి తెలుగు వికీపీడియాకు ఘన విజయం చేకూర్చినవారిలో వెంకటరమణ, మీనా గాయత్రి, రవిచంద్ర, పవన్ సంతోష్, మురళీ మోహన్, సుజాత, సుల్తాన్ ఖాదర్, విశ్వనాథ్, భాస్కర నాయుడు, ప్రణయ్ రాజ్, రామకృష్ణారెడ్డి, మణికంఠ, రహ్మానుద్దీన్, రాజశేఖర్ మొదలైన వికీపీడియన్లు ఉన్నారు. పంజాబీ భాష, సిక్ఖు మత చరిత్ర, పంజాబీ ఆహారం, పంజాబీ దుస్తులు, పంజాబీ పండుగలు, పంజాబి కవులు, పంజాబీ మాండలీకాలు మొదలైన అంశాలపై చక్కని వ్యాసాలను వికీపీడియన్లు మంచి మూలాలు, బొమ్మలతో సృష్టించారు. ఈ ఎడిటథాన్ గురించి పలువురు వికీపీడియన్లు మాట్లాడుతూ సమిష్టిగా తెలుగు వికీపీడియా సాధించిన ఈ విజయం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ఉత్సాహం అందిస్తుందని అభిప్రాయపడ్డారు.

(''ప్రణయ్ రాజ్ వంటి పలువురు వికీపీడియన్లను స్థానిక వార్తాపత్రికల వారు పంజాబ్ ఎడిటథాన్ లో తెవికీ విజయం గురించి రాయమని అడుగుతూ ఉండడంతో వారికి పంచేందుకు నమూనా పత్రికా ప్రకటన ఆయన కోరికపై తయారుచేశాను. ఎవరైనా మార్పులు చేర్పులు సూచించవచ్చు, అనౌచిత్యాలు ఉంటే సవరించవచ్చు. అలానే కొన్ని పడికట్టు పదాలు పత్రికా రచనలో తప్పనిసరి అని గమనించగలరు. వికీపీడియన్లు దీన్ని స్థానిక పత్రికలకు ఇవ్వదలుచుకుంటే ఆ జిల్లాలోని వికీపీడియన్లు కేంద్రంగా ఇవ్వగలరు. ఉదాహరణకు: ఈ విజయంలో జిల్లాకు చెందిన ××××, yyyy కృషి చేయడం విశేషం. వంటివి. ఎందుకంటే స్థానికత మన తెలుగు పత్రికల విషయంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది''--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 08:00, 9 ఆగష్టు 2016 (UTC))

: ధన్యవాదాలు [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారు.--[[వాడుకరి:Pranayraj1985|Pranayraj1985]] ([[వాడుకరి చర్చ:Pranayraj1985|చర్చ]]) 08:50, 9 ఆగష్టు 2016 (UTC)
::[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]]గారికి చాలా బాగా రాసారు. ఇది తెలుగు వికీపీడియా సముదాయ సభ్యుల విజయం కనుక వారి కృషి కొరకు చేస్తున్న ప్రకటన, దీనిని తెలుగు సముదాయానికి మాత్రమే పరిమితం చేయ ప్రార్ధన. తెలుగు బాషను ఉన్నతంగా ఎత్తి చూపే ఏ కార్యాలైనా వాటికి తగిన గుర్తింఫు రావాలి, అలాంటి ప్రయత్నాలు చెయ్యాలి అని నా అభిప్రాయం. --[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|Viswanadh]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 09:25, 9 ఆగష్టు 2016 (UTC)

== ఆదివారం తెలుగు వికీపీడియా దినోత్సవం - వికీపీడియన్లకు సాంకేతిక శిక్షణ ==

డిసెంబరు రెండవ ఆదివారం తెలుగు వికీపీడియా దినోత్సవం సందర్భంగా స్థానిక అబిడ్స్ లోని గోల్డెన్ థ్రెషోల్డ్ లో వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా డిసెంబరు 10, 11 తేదీల్లో వికీపీడియన్లకు, వికీపీడియా ఔత్సాహికులకు వికీపీడియాకు సంబంధించిన పలు సాంకేతిక అంశాలు, కార్యక్రమ నిర్వహణ సామర్థ్యాలు వంటివాటిలో శిక్షణనిస్తారని సీఐఎస్-ఎ2కె ప్రతినిధి పవన్ సంతోష్ తెలియజేశారు. కార్యక్రమానికి ప్రముఖ ఆంగ్ల వికీపీడియన్, సీఐఎస్-ఎ2కె సంస్థ ఉద్యోగి టిటో దత్తా హాజరై శిక్షణ నిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరుకాదలిచినవారు pavansanthosh.s@gmail.com మెయిల్ కు సంప్రదించాలని సూచించారు. 11వ తేదీ సాయంత్రం హైదరాబాద్ వికీపీడియా నెలవారీ సమావేశంలో వేడుకలు, భవిష్యత్ కార్యకలాపాలపై చిరు సమీక్ష, వందరోజులు-వంద వ్యాసాలు ఛాలెంజ్ లో విజయవంతంగా సాధించిన తెలుగు వికీపీడియన్లకు చిరుసత్కారం వంటివి ఉంటాయని పేర్కొన్నారు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె)]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 05:02, 7 డిసెంబరు 2016 (UTC)

== వికీపీడియా కార్యక్రమాల నిర్వహణపై, వికీపీడియా రచనకు ఉపకరణాలపై అవగాహన ==

వికీపీడియాను అభివృద్ధి చేసేందుకు వివిధ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన నాయకత్వ శిక్షణ, వికీపీడియాలో పనికివచ్చే ఉపకరణాల గురించి శిక్షణ వంటివి వికీపీడియన్లకు అందించారు. అబిడ్స్ గోల్డెన్ థ్రెషోల్డ్ శనివారం ప్రారంభమైన రెండు రోజుల మినీ మీడియా వికీ ట్రైనర్, ట్రైన్ ద ట్రైనర్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆంగ్ల వికీపీడియన్ టిటో దత్తా మాట్లాడుతూ తెలుగు వికీపీడియాను అభివృద్ధి చేయడం ద్వారా తెలుగును అభివృద్ధి చేయవచ్చనీ వివరించారు. వికీపీడియాను అభివృద్ధి చేయడానికి కళాశాలల్లో కార్యశాల, ఫోటోవాక్, ఎడిట్-అ-థాన్ తదితర కార్యక్రమాలు నిర్వహించవచ్చని వివరించారు. చరిత్రకారుడు, రచయిత, తెలుగు వికీపీడియన్ కట్టా శ్రీనివాసరావు మాట్లాడుతూ గోల్కొండ వంటి ప్రదేశాల్లో కూడా ప్రజలకు తెలియని చారిత్రక, సాంకేతిక ప్రదేశాలు, అంశాలు ఉన్నాయని, వాటిని ఫోటోలు తీసి వికీమీడియా కామన్స్ లో చేర్చవచ్చని తెలిపారు. కార్యక్రమాన్ని సీఐఎస్-ఎ2కె ప్రతినిధి పవన్ సంతోష్, వికీపీడియన్ ప్రణయ్ రాజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వికీపీడియన్లు కశ్యప్, మీనా గాయత్రి, మౌర్య, నాగేశ్వరరావు వంటివారితో పాటు కొత్తగా వికీపీడియాలో చేరినవారూ పాల్గొన్నారు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె)]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 09:41, 10 డిసెంబరు 2016 (UTC)

06:44, 29 ఏప్రిల్ 2024 నాటి చిట్టచివరి కూర్పు

అడ్డదారి:
WP:VPPR
రచ్చబండవార్తలుపాలసీలుసాంకేతికముప్రతిపాదనలుఆలోచనలుపత్రికా సంబంధాలుఇతరత్రా..

తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం సందర్బంగా విలేఖరులతో ఒక ప్రత్యేక కార్యక్రమం

[మార్చు]

తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం సందర్భంగా విలేఖరులతో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం చాలా ముఖ్యం. ఈ కార్యక్రమం ద్వారా తెలుగు వికీపీడియా యొక్క ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయవచ్చు.ఈ కార్యక్రమంలో వికీపీడియా సభ్యులు, వికీపీడియా నుండి ప్రయోజనం పొందిన వ్యక్తులు మరియు వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా తెలుగు వికీపీడియా గురించి ప్రజల్లో అవగాహన పెరగడానికి మరియు మరింత మంది వారు వికీపీడియాలో సహకరించడానికి ప్రేరేపించడానికి సహాయపడుతుంది. అంతే కాక రాబోవు ఎన్నికల కోసం కూడా తెలుగు వికీపీడియాలో విలువైన సమాచారం ఉన్నది, దీని కోసం తెవికీ అభివృద్ధికి తోడ్పడుతూ స్వతహాగా జర్నలిస్ట్‌ అయిన అయిన @Batthini_Vinay_Kumar_Goud గారిని ఈ విషయంలో దిశానిర్దేశం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను, Kasyap (చర్చ) 10:01, 16 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@Kasyap గారు ఎన్నికల సందర్బంగా కొద్దిగా బిజీ ఉండడం వల్ల రిప్లై ఇవ్వలేక పోయాను. మీరు ప్రస్తావించిన కార్యక్రమ ప్రస్తుత ఎన్నికల సమయంలో కష్టమే కావొచ్చు, కానీ ఎన్నికల తరువాత తప్పకుండా ఈ కార్యక్రమం నిర్వహిద్దాం. Batthini Vinay Kumar Goud (చర్చ) 09:13, 21 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Kasyap గారూ, తెలుగు వికీపీడియా వార్షికోత్సవం గురించి చర్చల్లో ప్రస్తావించండి సార్. ఇందుకు ప్రయత్నిద్దాం. పవన్ సంతోష్ (చర్చ) 15:04, 22 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రంథాలయ సర్వస్వం మాసపత్రిక నవంబర్ 2023 సంచికలో తెలుగు వికీపీడియా ప్రస్తావన

[మార్చు]

గ్రంథాలయ సర్వస్వం అనే మాసపత్రిక నవంబర్ 2023 సంచికలో తెలుగు వికీపీడియా గురించిన ప్రస్తావన ఉంది. తెవికిలో సమాచారం కొరకు ఆ వ్యాసం మాత్రమే సేకరించి అప్లోడ్ చేసి లింక్ ఇచ్చాను. ధన్యవాదాలు. వి.జె.సుశీల (చర్చ) 06:44, 29 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]