అక్షాంశ రేఖాంశాలు: 16°32′00″N 81°44′00″E / 16.5333°N 81.7333°E / 16.5333; 81.7333

భీమవరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భీమవరం
సోమేశ్వరస్వామి దేవాలయం
సోమేశ్వరస్వామి దేవాలయం
భీమవరం is located in ఆంధ్రప్రదేశ్
భీమవరం
భీమవరం
Coordinates: 16°32′00″N 81°44′00″E / 16.5333°N 81.7333°E / 16.5333; 81.7333
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపశ్చిమ గోదావరి
Government
 • Typeస్థానిక స్వపరిపాలన
 • Bodyభీమవరం పురపాలక సంఘం
విస్తీర్ణం
 • పట్టణం24.68 కి.మీ2 (9.53 చ. మై)
 • Rank34th (in state)
Elevation
1.5 మీ (4.9 అ.)
జనాభా
 (2011)
 • పట్టణం1,04,216
 • Rankఆంధ్రప్రదేశ్ లో 34వ
 • జనసాంద్రత10,939/కి.మీ2 (28,330/చ. మై.)
 • Metro
1,10,075
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
534201
టెలిఫోన్ కోడ్+91–8816
Vehicle registrationఎపి–37

భీమవరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా పట్టణం, జిల్లా కేంద్రం. ఇది భీమవరం మండలానికి కేంద్రం కూడా. ఏలూరు పట్టణాభివృద్థి సంస్థలో భాగం. పంచారామాల్లో ఒకటైన సోమారామం ఇక్కడ ఉంది. ఈ పట్టణ పరిసరాలలో రొయ్యల/చేపల చెరువుల, బియ్య మిల్లులు, వరి/వ్యవసాయ-సంబంధిత కర్మాగారాలున్నాయ.

పేరు వ్యుత్పత్తి

[మార్చు]

తూర్పు చాళుక్య రాజైన భీమ పేరు మీద ఈ పట్టణానికి భీమవరం అనే పేరు వచ్చింది.

చరిత్ర

[మార్చు]

పంచారామములలో ఒకటైన ఈ భీమవరం సోమేశ్వర స్వామి క్షేత్రం. తూర్పు చాళుక్య రాజైన భీమ సా.శ. 890-918 సంవత్సరాల మధ్య ఇక్కడ సోమేశ్వర దేవాలయానికి శంకుస్థాపన చేశాడు. ఈ దేవాలయం ఇప్పుడు గునుపూడిలో ఉంది. సా.శ.1120-1130 సంవత్సరాల మధ్య ప్రక్కను ఉన్న విస్సాకోడేరు, ఉండి, పెద్దఅమిరమ్ గ్రామాలకు రహదారి ఏర్పడింది. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో పూజ్య బాపూజీ భీమవరం నగరానికి 'రెండవ బార్దొలి' అని బిరుదు ప్రధానం చేశారు.

భౌగోళికం

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఉత్తరంగా 135 కి.మీ దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 జనగణన ప్రకారం మొత్తం జనాభా 1,04,216.

సామాజికవర్గాలు

[మార్చు]

ఆంధ్ర క్షత్రియ రాజులు, కాపు సామాజిక వర్గాలు ఎక్కువగా కనిపిస్తాయి. కొద్దిగా భట్టు రాజులు, బ్రాహ్మణ, కమ్మ,రెడ్డి, దళిత వర్గాలవారు కనిపిస్తారు. [ఆధారం చూపాలి] భీమవరం పట్టణంలో ఎక్కువగా పెద్ద-చిన్నా వ్యాపారాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు కనిపిస్తాయి. రాష్ట్రంలో ఇతర పట్టణాలకు భిన్నంగా భీమవరంలో అత్యంత విలాసవంతమైన జీవన విధానం కనిపిస్తుంది. అందువల్ల భీమవరం పట్టణానికి ఆంధ్రా లాస్‌వేగాస్ అని పేరు కూడా ఉంది.[ఆధారం చూపాలి]

పరిపాలన

[మార్చు]

భీమవరం పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

గ్రేటర్ భీమవరం

[మార్చు]

పురపాలక సంఘానికి రాయలం (పాక్షికంగా) చినఅమిరం (పాక్షికంగా) గ్రామాలను విలీనం చేస్తున్నట్లు వచ్చిన ప్రతిపాదనల తీర్మానం కౌన్సిల్‌ ఆమోదించింది. ప్రస్తుతం 39వ వార్డులతో ఉన్న పురపాలక సంఘం సుమారు 1.4 లక్షల మంది జనాభాను (2011 జనాభా లెక్కలు ప్రకారం) కలిగి ఉంది. పంచాయతీల విలీనం జరిగితే గ్రేటర్ కార్పొరేషన్ (గ్రేటర్ సిటీ) అవుతుంది అని అంచనా పైన పేర్కొన్న విషయం కార్య రూపం దాల్చకున్నా, 2019 జనవరి 1న ఇది ఏలూరు పట్టణాభివృద్ధిసంస్థలో చేర్చబడింది. [ఆధారం చూపాలి]

రవాణా సౌకర్యాలు

[మార్చు]

రహదారి

[మార్చు]

పామర్రు- దిగమర్రు రోడ్ (పాలకొల్లు)ను కలిపే జాతీయ రహదారి 165 పై ఈ పట్టణంవుంది.

రైలు మార్గం

[మార్చు]

భీమవరంలో రెండు రైల్వే స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. భీమవరం టౌన్ నర్సాపురం, విజయవాడ, నిడదవోలు బ్రాంచి లైన్లకు కూడలి. కాని భీమవరం లోని లైన్ బైపాస్ ఏర్పాటు వల్ల, చాలా రైళ్ళు భీమవరం టౌన్ స్టేషనుకు మాత్రమే వస్తాయి. దీని వల్ల ఇంజిన్ జంక్షను వద్ద తిప్పే అవసరము లేదు. భీమవరం టౌన్ స్టేషను దీని వల్ల గ్రేడ్-ఎ స్టేషనుగా మారడానికి అవకాశం కలిగింది. ఈ లైన్ల యొక్కట్రాక్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులు పనులు పూర్తయి భీమవరం -విజయవాడ, భీమవర జంక్షన్ - నిడదవోలు మధ్య ప్రయాణ సమయం తగ్గింది.[1]

సంస్కృతి

[మార్చు]

సాహిత్యం

[మార్చు]

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మరే పట్టణంలోనూ లేనన్ని సాహిత్య సంస్థలు భీమవరంలో విలసిల్లాయి. 1990ల నాటికి కళాస్రవంతి, కళాసమాఖ్య, భాగవతి విజ్ఞానసమితి, రసచంద్రిక, సాహితీ సంపత్, వసంత భారతి, కవితా ప్రభాస, రవీంద్ర సారస్వత సమాజం, శ్రీ రామరాజభూషణ సాహిత్య పరిషత్, జాషువా సాహితీ సమితి, శ్రీనివాస భారతి వంటి సాహితీ సంస్థలు నెలకొన్నాయి.[2] శ్రీరామరాజభూషణ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో వసుచరిత్ర కావ్యం పుట్టి 400 ఏళ్ళయిన సందర్భంగా వసుచరిత్ర చతుశ్శతజయంతి,[3] రవీంద్ర సారస్వత సమాజం వారి వార్షికోత్సవాలు,[4] కవితా ప్రభాస సంస్థ నిర్వహణలో కవితా ప్రభాస కార్యక్రమాలు,[5] ఆరుబయట పండువెన్నెల్లో రసచంద్రిక సాహిత్య సభలు,[6] దక్షిణాంధ్రయుగంలోని రఘునాథ నాయకుల సభను కళ్ళకు కడుతూ కళాస్రవంతి నిర్వహించిన ఇందిరా మందిర సభ, వసంత భారతి నిర్వహించిన వసంత రాత్రుల కవితా గానాలు [7] వంటివి భీమవరం సాహిత్య చరిత్రలో గుర్తుంచుకోదగిన పలు విశిష్టమైన కార్యక్రమాలు.

పర్యాటక ప్రదేశాలు

[మార్చు]
భీమవరం పట్టణంలో సాయంత్ర సమయం

సోమేశ్వరస్వామి దేవాలయం

[మార్చు]

భీమవరంలోని సోమేశ్వరస్వామి దేవాలయం (భీమారామం) పంచారామాలలో ఒకటి. ఈ భీమారామము భీమవరమునకు రెండుకిలోమీటర్లదూరంలో గునుపూడిలో ఉంది. ఇక్కడిలింగమును చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణంలో చెప్పబడుతుంది; చంద్రుని పేరున దీనిని సోమేశ్వరక్షేత్రమని పిలుస్తారు. చంద్ర-ప్రతిష్ఠ అగుటచే పొర్ణమికి శ్వేతవర్ణంతోనూ, అమావాస్యకు గోధుమ వర్ణంతోనూ ప్రకాశించుట ఈ లింగ మహత్యం. ఇక్కడ ప్రతీ కార్తీకమాసంలో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. శ్వేతవర్ణంలో కనిపించే ఈ లింగము క్రమ క్రమముగా అమావాస్య వచ్చే సరికి బూడిద/గోధుమ వర్ణమునకు మారిపోతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యదాతధంగా శ్వేతవర్ణములో దర్శనమిస్తుంది. ఈ మార్పులను గమనించాలంటే పౌర్ణమికి అమావాస్యకు దర్శిస్తే తెలుస్తుంది. ఆలయం ముందు ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు గట్టున రాతి స్తంభముపై ఒక నందీశ్వరుని విగ్రహము ఉపస్థితమై ఉంది. ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారమును దర్శించవచ్చును. అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. ఈ ఆలయము రెండు అంతస్తులుగా ఉంటుంది. అదిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే అదే గర్భాలయ పైబాగాన రెండవ అంతస్తులో వేరే గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది.

మావుళ్ళమ్మ దేవస్థానం

[మార్చు]
  • మావుళ్ళమ్మ గుడి: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని గ్రామదేవతల ఆలయాలలో దీనికి ఆదాయము ఎక్కువ. ఇది పట్టణ నడిబొడ్డున ఉంది. దేవస్థాన ఆవరణలో కల కొటికలపూడి గోవిందరావు కళా వేదికపై సినీ నటులచే పలు సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రఖ్యాత నటీనటులకు సన్మానాలు చేస్తారు. ఇక్కడ నిత్య అన్నదానం జరుగును.

చిత్రమాలిక

[మార్చు]

ప్రముఖులు

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు, వనరులు

[మార్చు]
  1. "విజన్ 2020" (PDF).
  2. ద్వానా శాస్త్రి, p. 151.
  3. ద్వానా శాస్త్రి, p. 152.
  4. ద్వానా శాస్త్రి, p. 156.
  5. ద్వానా శాస్త్రి, p. 157.
  6. ద్వానా శాస్త్రి, p. 158.
  7. ద్వానా శాస్త్రి, p. 159.

ఆధార గ్రంథాలు

[మార్చు]
  • ద్వానా శాస్త్రి, సాహిత్య సంస్థలు

బయటి లింకులు

[మార్చు]
  1. భీమవరంఇన్ఫో.కామ్
"https://te.wikipedia.org/w/index.php?title=భీమవరం&oldid=4153494" నుండి వెలికితీశారు