అక్షాంశ రేఖాంశాలు: 17°15′58″N 78°24′20″E / 17.26619°N 78.40551°E / 17.26619; 78.40551

శంషాబాద్ (పి)

వికీపీడియా నుండి
(శంషాబాదు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శంషాబాద్
—  రెవిన్యూ గ్రామం  —
శంషాబాద్ is located in తెలంగాణ
శంషాబాద్
శంషాబాద్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°15′58″N 78°24′20″E / 17.26619°N 78.40551°E / 17.26619; 78.40551
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం శంషాబాద్
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 87,837
 - పురుషుల సంఖ్య 45,201
 - స్త్రీల సంఖ్య 42,636
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

శంషాబాద్ (పి), తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలానికి చెందిన గ్రామం.[1] తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న శంషాబాద్ పురపాలకసంఘంగా ఏర్పడింది.[2]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ పరిధిలోని జనాభా- మొత్తం 87,837 - పురుషులు 45,201 - స్త్రీలు 42,636.సముద్రమట్టనికి 581 మీ.ఎత్తు[4]

ప్రముఖులు

[మార్చు]
బంగారు లక్ష్మణ్ - భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేశాడు.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

శ్రీ విద్యా హైస్కూల్, కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్, ఒయాసిస్ హైస్కూల్, శ్రీ విజ్ఞాన్ జూనియర్ కాలేజి, గవర్నమెంట్ జూనియర్ కాలేజి ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ శంషాబాద్ మండలంలో ఫోర్ట్ గ్రాండ్ అండర్‌పాస్ సమీపంలో మెట్రో స్టేషన్‌ను ప్లాన్ చేసింది.[5][6][7] రోడ్డు రవాణా సంస్థ బస్ సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; ఉమ్రానగర్, ప్రధాన స్టేషన్ హైదరాబాదు 18 కి.మీ దూరంలో ఉంది.

అంతర్జాతీయ విమానాశ్రయం

[మార్చు]

నిద్రలో జోగుతున్నట్టుగా ఉండే శివారు ప్రాంతపు గ్రామం షాంస్ ఉల్ ఉమ్రా పేరు కాస్త శంషాబాద్ గా మారింది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించబడి ఇప్పుడు చాలా పాపులర్ పేరుగా మారింది.23 మార్చి 2008 న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటైంది. దీని మొత్తం విస్తీర్ణం 5400 ఎకరాలు.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-08.
  2. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 26 March 2021.
  3. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-06.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-05-14. Retrieved 2016-07-09.
  5. "HAML completes 21 km of pre-construction survey work".
  6. "Pre-construction works for Hyderabad Airport Metro works in full swing".
  7. "Airport metro progressing at a brisk pace".

వెలుపలి లింకులు

[మార్చు]