చర్చ:కాట్రగడ్డ పద్దయ్య

వికీపీడియా నుండి
14:59, 4 జూలై 2024 నాటి కూర్పు. రచయిత: Chaduvari (చర్చ | రచనలు)
(తేడా) ←పాత కూర్పు | ప్రస్తుతపు కూర్పు చూపించు (తేడా) | దీని తరువాతి కూర్పు→ (తేడా)
Jump to navigation Jump to search

శీర్షిక పేరు

[మార్చు]

@Chaduvari గారు శీర్షిక పేరును కాట్రగడ్డ పెద్దయ్యగా మారిస్తే బాగుంటుందెమో. ఎందుకంటే కాట్రగడ్డ పెద్దయ్య అనే పేరే వాడుకలో ఉంది. శోధించినప్పుడు కూడా ఆపేరే కనిపిస్తుంది. నమస్కారం. ఉదయ్ కిరణ్ (చర్చ) 12:19, 4 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@ఉదయ్ కిరణ్ గారూ, ఈ విషయాన్ని పరిశీలించి చెప్పినందుకు ధన్యవాదాలు. నేను పద్దయ్య అనే పేరు పెట్టడానికి కారణాలు:
  • పద్దయ్య అనే పేరు గతంలో బాగానే పెట్టుకునేవారు. పెద్దయ్య కంటే అదే ఎక్కువగా కనబడుతుంది.
  • ఆయన కోసం వెతికినపుడు అన్నీ ఇంగ్లీషు నుంది చేసిన అనువాదాలే కనిపించాయి గానీ, నేరుగా తెలుగు మాటలౌ కనబడలేదు. (బహుశా మీరు వెతికినపుడూ కూడా ఇంగ్లీషు లింకులే వచ్చి ఉంటాయి, అయిత్యే గూగుల్ వాటిని తెలుగు లోకి అనువదించి చూపిస్తుంది, మన కన్నుగప్పుతుంది) ఇంగ్లీషు స్పెల్లింగు ఎక్కడ చూసినా పద్దయ్య (Paddayya) అనే ఉంది గానీ పెద్దయ్య (Peddayya) అని లేదు.
అంచేత పేరు విషయంలో నాకు సందేహమేమీ కలగలేదు. అయితే, మీరు చెప్పాక, సరైన పేరు ఏమిటి అనేదాని గురించి మరింత వెతికాను. ఒక్కచోట తప్ప ఇంకెక్కడా ఆయన గురించి తెలుగులో సమాచారం దొరకలేదు. ఎక్కడబడినా ఇంగ్లీషే, పద్దయ్య (Paddayya) అనే కనబడింది. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ గురించి రాసిన ఈ ఒక్క వ్యాసంలో మాత్రమే ఆ పేరు తెలుగులో కనబడింది. అక్కడ పద్దయ్య అనే ఉంది. మీరు కూడా చూడండి.
అయితే, మీకు ఆ పేరు గురించి మరింత స్పష్టమైన మూలం ఎక్కడైనా లభిస్తే ఇక్కడ రాయండి, మార్చేద్దాం. ఈ విషయమై మీరు చర్చ పెట్టినందుకు నాకు సంతోషంగా ఉంది. దానివల్ల మరింత వెతికి పైన చెప్పిన తెలుగు పేరు లింకు పట్టుకున్నాను.__ చదువరి (చర్చరచనలు) 14:59, 4 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]