కరణ్ భూషణ్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కరణ్ భూషణ్ సింగ్
పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ
Assumed office
2024 జూన్ 4
అంతకు ముందు వారుబ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్
నియోజకవర్గంకైసర్‌గంజ్
ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్, అధ్యక్షుడు
Assumed office
2024 ఫిబ్రవరి 12
వ్యక్తిగత వివరాలు
జననం (1990-12-13) 1990 డిసెంబరు 13 (వయసు 33)
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామినేహా సింగ్
బంధువులుప్రతీక్ భూషణ్ సింగ్ (సోదరుడు)
సంతానం2
తల్లిదండ్రులుబ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (తండ్రి)
కేతకీ దేవి సింగ్ (తల్లి)

కరణ్ భూషణ్ సింగ్ ఒక భారతీయ రాజకీయ నాయకుడు, భారతీయ జనతా పార్టీ సభ్యుడు. ఆయన కైసర్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడు.[1] ఆయన ఏడు సార్లు ఎంపీగా చేసిన, అలాగే మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కుమారుడు.[2] ఆయన ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు, గోండాలోని నవాబ్‌గంజ్‌లోని సహకార అభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు.[3][4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కరణ్ భూషణ్ సింగ్ 1990 డిసెంబరు 13న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, కేత్కి దేవి సింగ్ దంపతులకు జన్మించాడు. ఆ కుటుంబంలో అతను అందరికంటే చిన్నవాడు. అతని సోదరుడు ప్రతీక్ భూషణ్ సింగ్ కూడా ఒక భారతీయ రాజకీయ నాయకుడు, గోండాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర ప్రదేశ్ శాసనసభకు 2వ టర్మ్ సభ్యుడు.

అతను డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఆస్ట్రేలియాలో బిజినెస్ మేనేజ్‌మెంట్ డిప్లొమా పొందాడు. అతను మాజీ జాతీయ డబుల్ ట్రాప్ షూటర్ కూడా.[5][6]

ఆయనకు ఇద్దరు పిల్లలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.[5]

రాజకీయ జీవితం

[మార్చు]

కైసర్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 18వ లోక్‌సభ ఎన్నికలలో అతను 571,263 ఓట్లను సాధించి, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి భగత్ రామ్ మిశ్రాను 148,843 ఓట్ల తేడాతో ఓడించాడు. [7]

మూలాలు

[మార్చు]
  1. "Election Commission of India". results.eci.gov.in. Election Commission of India. Retrieved 5 June 2024.
  2. Bajpai, Namita (2024-05-04). "Young and old proxy players in legacy battles". The New Indian Express. Retrieved 2024-06-11.
  3. "Brij Bhushan's son elected UP wrestling association president". The Times of India. 2024-02-14. ISSN 0971-8257. Retrieved 2024-06-07.
  4. "Brij Bhushan Singh's son Karan wins from UP's Kaiserganj on BJP ticket". India Today (in ఇంగ్లీష్). 2024-06-04. Retrieved 2024-06-12.
  5. 5.0 5.1 "Who is Karan Bhushan Singh? Former shooter is BJP's Kaiserganj pick". India Today (in ఇంగ్లీష్). 2024-05-02. Retrieved 2024-06-07.
  6. "विदेश से पढ़ाई, शूटिंग के नेशनल खिलाड़ी... कौन हैं बृजभूषण के बेटे करण भूषण सिंह जिन्हें BJP ने कैसरगंज से दिया टिकट". आज तक (in హిందీ). 2024-05-02. Retrieved 2024-06-07.
  7. Anand, Nisha (2024-06-04). "Lok Sabha polls result: Brij Bhushan Singh's son Karan wins UP's Kaiserganj". Business Standard. Retrieved 2024-06-12.