తాళ్ళపల్లి (నస్పూర్)
తాళ్ళపల్లి | |
---|---|
Coordinates: 18°06′57″N 78°34′12″E / 18.11583°N 78.57000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మంచిర్యాల జిల్లా |
విస్తీర్ణం | |
• Total | 12.08 కి.మీ2 (4.66 చ. మై) |
జనాభా (2011)[1] | |
• Total | 9,656 |
• జనసాంద్రత | 800/కి.మీ2 (2,100/చ. మై.) |
భాష | |
• అధికార భాష | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 504302 |
Vehicle registration | టిఎస్ |
తాళ్ళపల్లి, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, నస్పూర్ మండలానికి చెందిన జనగణన పట్టణం, రెవెన్యూ గ్రామం. ఈ పట్టణం నస్పూర్ పురపాలక సంఘంలో భాగంగా ఉంది.[1] జిల్లా కేంద్రమైన మంచిర్యాల నుండి 7 కి.మీ.ల దూరంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని మంచిర్యాల మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన నస్పూర్ మండలం లోకి చేర్చారు.[2]
భౌగోళికం
[మార్చు]తాళ్ళపల్లి పట్టణం 18°06′57″N 78°34′12″E / 18.11583°N 78.57000°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. ఈ పట్టణ విస్తీర్ణం 12.08 కి.మీ2 (4.66 చ. మై) గా ఉంది.
సమీప ప్రాంతాలు
[మార్చు]సింగాపూర్, నస్పూర్, శ్రీరాంపూర్, రామారావుపేట మొదలైనవి తాళ్ళపల్లికి సమీపంలో ఉన్నాయి.[3]
జనాభా గణాంకాలు
[మార్చు]2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[4] తాళ్ళపల్లి పట్టణంలో 10,937 జనాభా ఉంది. ఈ మొత్తం జనాభాలో పురుషులు 52% మంది కాగా, స్త్రీలు 48% మంది ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 56% కాగా, ఇది జాతీయ సగటు 59.5% కంటే తక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 63% కాగా, స్త్రీల అక్షరాస్యత 47%గా ఉంది. తాళ్ళపల్లిలోని జనాభాలో 11% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- హనుమాన్ దేవాలయం
- భీమన దేవాలయం
- బీరప్ప దేవాలయం
- మస్జిద్-ఇ-హబీబియా
- మదీనా మసీదు
రవాణా
[మార్చు]ఇక్కడికి సమీపంలోని మంచిర్యాల, రవీంద్రఖని, పెద్దంపేట్ ప్రాంతాలలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. మంచిర్యాల నుండి తాళ్ళపల్లికి రోడ్డు కనెక్టివిటీ ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "District Census Handbook – Karimnagar" (PDF). Census of India. pp. 13, 30. Retrieved 10 June 2016.
- ↑ "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "Thallapally Village , Mancherial Mandal , Adilabad District". www.onefivenine.com. Retrieved 2021-10-27.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.