డీవీడీ
మీడియా టైప్ | Optical disc |
---|---|
సామర్ధ్యం | 4.7 GB (single-sided, single-layer – common) 8.5–8.7 GB (single-sided, double-layer) 9.4 GB (double-sided, single-layer) 17.08 GB (double-sided, double-layer – rare) |
చదివే విధానం (Read mechanism) | 650 nm laser, 10.5 Mbit/s (1×) |
వ్రాసే విధానం (Write mechanism) | 10.5 Mbit/s (1×) |
అంతర్జాతీయ ప్రమాణం | DVD Forum's DVD Books and DVD+RW Alliance specifications |
బరువు | 16g[1] |
డీవీడీ డిజిటల్ ఆప్టికల్ డిస్క్ స్టోరేజ్ పద్ధతి. సినిమాలు, పాటలు, దస్త్రాలు లాంటి సమాచారం భద్రపరచేందుకు వాడే ఉపకరణం. ఇది 1995లో ఫిలిప్స్, సోనీ, తోషీబా,, పానసోనిక్ సంస్థల ద్వారా సంయుక్తంగా కనిపెట్టి, అభివృద్ధి పరిచబడింది. సీడీ పరిమాణంలోనే ఉండే డీవీడీ జ్ఞప్తి (దస్త్రాల నిలువ) విషయంలో సీడీకన్నా ఎక్కువ సామర్థ్యం గలది.
ముందస్తుగా రూపొందించబడే డీవీడీలు భారీ స్థాయిలో మోల్డింగ్ మషీనుల ద్వారా ముద్రించబడతాయి, ఈ డీవీడీలను డీవీడీ-రోం (రీడ్ ఆన్లీ మెమరీ) అంటారు. ఎందుకంటే ఈ డీవీడీలపై సమాచారం ఒకసారి రాయబడ్డాక కేవలం చదవవచ్చు, మరలా కొత్త ఫైళ్ళను చేర్చడం, ఉన్న సమాచారం తీసివేయడం లాంటివి ఉండవు. ఖాళీ డీవీడీల లోకి డీవీడీ రికార్డర్ ద్వారా సమాచారాన్ని, దస్త్రాలను ఎక్కించవచ్చు. ఒకసారి ఎక్కించాక డీవీడీ-ఆర్ అని ఉన్నవి డీవీడీ-రోంగా మారిపోతాయి. మరలా-మరలా రాయదగ్గ డీవీడీలలో (డీవీడీ-ఆర్డబ్లూ, డీవీడీ+ఆర్డబ్లూ, డీవీడీ-రాం) ఎన్నిసార్లయినా చెరిపి కొత్త సమాచారాన్ని జోడించవచ్చు.
మూలములు
[మార్చు]- ↑ "How much does a DVD weigh?". Answers.com. Retrieved December 27, 2012.